Indira Gandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Indira Gandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2020, గురువారం

ఎమర్జెన్సీ: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి కారణమేంటి? సంజయ్ గాంధీ అప్పుడు సాగించిన అరాచకాలేమిటి?


Indira Gandhi Sanjay Gandhi ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ

June 25, 1975 Emergecy In India - Indira Gandhi, Sanjay Gandhi

ఎమర్జెన్సీ... స్వతంత్ర భారత దేశం 28 ఏళ్ల వయసులో ఉరకలేయాల్సిన వేళ ఇందిరాగాంధీ నియంతృత్వానికి బలైంది. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక స్థితి ఆమె అనువంశిక పాలన, నియంతృత్వ ధోరణి, వ్యక్తిపూజ వంటి దుర్లక్షణాలకు భయంకరమైన సాక్ష్యం. 
1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిర విధించిన ఎమర్జెన్సీ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ప్రభుత్వం, దాని రౌడీ మూకలు దారుణంగా చెరిచాయి.. చంపాయి.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ చీకటి అధ్యాయానికి నేటితో 45 ఏళ్లు.

ఇందిరాగాంధీ

ఎమర్జెన్సీ ఎందుకు విధించారు?

1971లో లోక్‌సభ సభ్యురాలిగా ఇందిరాగాంధీ గెలవడాన్ని ఆమెపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో సవాల్ చేశారు. కేసు విచారించిన కోర్టు ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదని తేల్చింది. ఆమె అధికారంలోనుంచి దిగిపోవాలని 1975 జూన్‌ 12న అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది. 
దానిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆమె ప్రధానిగా పనిచేయడానికి వీలులేదని, లోక్ సభ సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడటం, ఓటు వేయడం, లోక్‌సభ సభ్యురాలిగా జీతం పొందడం కూడా కుదరదన్న షరతులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కృష్ణ అయ్యర్‌ ఆమెకు బెయిలు మంజూరు చేశారు. 
అయితే... ఇందిరాగాంధీ స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి సమయం కావాలి కాబట్టి తీర్పును 20 రోజుల పాటు వాయిదా వేశారు.
అదే ఈ దేశం కొంపముంచింది. 


సుప్రీం నిర్ణయం నేపథ్యంలో సర్వోదయ ఉద్యమ నాయకులు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇందిర రాజీనామా కోరుతూ దేశవ్యాప్త సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. 
దాంతో దాన్నే కారణంగా చూపుతూ అంతర్గత కల్లోలం నుంచి దేశాన్ని కాపాడాలన్న కారణం చెప్పి ఇందిర ప్రభుత్వం 'ఎమర్జెన్సీ' ప్రకటించింది. 
ఇక అక్కడి నుంచి ఇందిరాగాంధీ, ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీలు సాగించిన అరాచకం అంతాఇంతా కాదు. 
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల పేరిట జరిగిన అరాచకాలు, పార్టీ కార్యకర్తల అండతో చేయించిన దాడులు, ఆదాయపుపన్ను శాఖను 'బ్లాక్‌ మెయిల్‌' చేసే యత్నాలు, పత్రికలపై ఉక్కుపాదం, పార్టీలోని భజనపరులు, తైనాతీలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం, ప్రతిపక్ష నాయకులను, మేధావులను, కవులు, రచయితలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళలో బంధించడం వంటి అన్యాయాలు అడ్డూ ఆపూ లేకుండా జరిగాయి.

సంజయ్ గాంధీ Sanjay Gandhi

రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చివేస్తూ పార్లమెంటుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టే సవరణలూ తీసుకువచ్చారు. పార్లమెంటు పదవీ కాలాన్ని అయిదేళ్లనుంచీ ఆరేళ్లకు పెంచారు. 'మిసా' (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం 1973) ద్వారా వేల సంఖ్యలో అసమ్మతి వాదుల్ని చెరసాలల్లో బంధించారు. 
వార్తా పత్రికల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పత్రికల్లో ఏం రాయాలో, ఏం రాయకూడదో ఆంక్షలు విధించారు. దీని ఫలితంగా కొన్ని దినపత్రికలు సంపాదకీయం ఉండాల్సిన చోటును ఏమీ రాయకుండా ఖాళీగా ఉంచి తాము అణచివేతకు గురవుతున్నామని నిరసన తెలిపేవి.
అలా చేయడంపైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 
ప్రభుత్వానికి అనుకూలంగా లేనట్లు కనిపించిన పాత్రికేయులు, కార్టూనిస్టులు, ఫొటోగ్రాఫర్లు సహా వేలాది మంది గుర్తింపు కార్డులు రద్దు చేశారు.
జర్నలిస్టులకు వర్తించే సౌకర్యాలను రద్దు చేయడంతోపాటు పత్రికా సమావేశాల్లో పాల్గొనకుండా వారిని నిషేధించారు. దేశ ప్రజాస్వామ్య, సామ్యవాద విలువల పరిరక్షణకే ఆ చర్యలన్నీ చేపట్టినట్లు ఆనాటి ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంది.

అంతర్గత అత్యవసర పరిస్థితుల పేరిట ఇందిర జమానాలో తీసుకువచ్చిన చట్టాలపై జనతా పార్టీ అధికారంలోకి రాగానే 1977 ఆగస్టులో శ్వేతపత్రం సమర్పించింది.
 రాజ్యాంగానికి చేసిన వివిధ సవరణలతో పాటు అనేక చట్టాలను పూర్వ స్థితికి తీసుకు వచ్చారు.

Read Also: